సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మరో 3 సమీకృత జిల్లా కలెక్టరేట్లు ప్రారంభంకానున్నాయి

హైదరాబాద్, జనవరి 8 (విశ్వం న్యూస్) : ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు గారి చేతులమీదుగా జనవరి నెలలో నూతనంగా మరో 3 సమీకృత జిల్లా కలెక్టరేట్లు ప్రారంభం కానున్నాయి. జనవరి 12 వ తేదీన ఉదయం మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ ను సీఎం కేసిఆర్ గారు ప్రారంభించనున్నారు. అదేరోజు (జనవరి 12) మధ్యాహ్నం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం కేసిఆర్ ప్రారంభిస్తారు.
సంక్రాంతి పండుగ తర్వాత
జనవరి 18 వ తేదీన ఖమ్మం జిల్లా నూతన సమీకృత జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించనున్నారు.