కన్నుల పండువగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం

డా.రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో
తిమ్మాపూర్, జనవరి 8 (విశ్వం న్యూస్) : రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ ఆధ్వ ర్యంలో ఆదివారం ఇల్లంతకుంట మండలం అంతగిరి గ్రామంలో నిర్వహించిన మానకొండూర్ నియోజక వర్గస్థాయి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనం కన్నుల పండువగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆటా పాటలతో ఆనందంగా గడిపి న మానకొండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు. రసమయితో పాటు ప్రజాప్ర తినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి పోచమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాంస్కృతిక సారథి కళాకారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కళా ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రజానాయ కుడు రసమయి తన ఆటా పాటలతో హోరెత్తించి, అలరించారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఉదయం 11 గంటల నుండి సాయం త్రం వరకు ఆద్యంతం సాగిన ఈ సమేళ నంలో అందరూ ఆనందోత్సాలతో గడిపారు.
ఈ కార్యక్రమంలో మానకొండూరు నియోజకవర్గంలోని పలు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణుల కుటుంబ సభ్యులు, మహిళలు, తదిత రులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
