పార్ట్ 2: బోడుప్పల్ ప్రజా ప్రతినిధుల కనుసైగల్లో అక్రమ కట్టడాల జోరు…

  • కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్
    యాజమాన్యం కేశవ నగర్లో
    అక్రమ నిర్మాణం

బోడుప్పల్, ఏప్రిల్ 19 ( విశ్వం న్యూస్ ) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా ప్రతినిధుల కనుసైగల్లో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పాత కమిషనర్ ఉన్నప్పుడు అక్రమ కట్టడాలు కట్టాలంటేనే జంకిన జనం, బిల్డర్లు..ఇప్పుడు యతేచ్చగా అక్రమ కట్టడాలు కడుతున్నారని, ఆయా డివిజన్ల ప్రజాప్రతినిధుల కనుసైగల్లో అక్రమ కట్టడాల జోరు జరుగుతుందని అయా స్థానిక ప్రజలు గుసగుసలాడుతున్నారు.

బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో టాక్స్ ల కట్టని వారి ఇల్లు డ్రైనేజీ నల్ల సీజ్ చేయడం జరుగుతుంది అంటే మున్సిపల్ అభివృద్ధి కోసం కావాల్సిన డబ్బుల కోసమే కదా అన్ని సీజ్ చేస్తున్నారు. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో వేలాదిగా అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే మాత్రం చూసి చూడనట్లు ఎందుకుంటున్నారో అర్థం కావడం లేదని ప్రజలు, మేధావులు నోటి మీద వేలు వేసుకుంటున్నారు.

మీరు రెగ్యులరైజేషన్ పేరుతో అదే విధంగా ఆర్బిఎస్ పేరుతో గానీ ఫైన్ పేరుతో గానీ వేసినట్లయితే కోట్ల రూపాయలు వసూలు అవుతాయని స్థానిక ప్రజలు మేధావులు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. కాబట్టి అటువైపు అధికారులు ఆలోచించాలని కోరుతున్నారు. కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం ఆయా స్కూల్ ముందు బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణం జీరో పర్మిషన్తో కడుతుంటే అధికారులు కమిషనర్ ఏం చేస్తున్నారని ఆయా కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు.

బోడుప్పల్ అంబేద్కర్ మున్సిపల్ కార్పొరేషన్ కు కూత పెట్టులో ఉన్నటువంటి సరస్వతి నగర్, మారుతి నగర్ చౌరస్తా, రామ్ రెడ్డి కాలనీ, విజయపురి కాలనీలలో అక్రమ కట్టడాల జోరు కొనసాగుతుందని, అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయాలని ఆయా కాలనీల ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *