Today TrendingVishwam Newsతాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

8వ నిజాం నవాబు ముకరంజా కన్నుమూత

8వ నిజాం నవాబు ముకరంజా కన్నుమూత

ముకర్రమ్ ఝా మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు సంతాపం ప్రకటించారు
హైదరాబాద్,జనవరి 15 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ సంస్థానం ఆఖరి నిజాం.. ‘మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్’ గారి మనుమడు, నిజాం పెద్దకొడుకు ఆజమ్ ఝా, దుర్రె షెహవార్ దంపతుల కుమారుడు ముకర్రమ్ ఝా (Mukarram Jah) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నిజాం వారసుడుగా, పేదల కోసం విద్యా వైద్య రంగాల్లో ముకర్రమ్ ఝా చేసిన సామాజిక సేవలకు గుర్తుగా, వారి అంత్యక్రియలను అత్యున్నతస్థాయి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు.
అక్టోబరు 6,1933న ఫ్రాన్స్‌లో ఒట్టోమన్ సామ్రాజ్యం యొక్క సామ్రాజ్య యువరాణి ప్రిన్స్ ఆజం జా మరియు యువరాణి దుర్రు షెహ్వార్‌లకు జన్మించారు, ముకరమ్ జా ఏప్రిల్ 6, 1967న ఎనిమిదవ అసఫ్ జాగా పట్టాభిషేకం చేశారు. అతను టర్కీలో నివసిస్తున్నాడు. టర్కీలోని ఇస్తాంబుల్ లో శనివారం రాత్రి మరణించిన ముకర్రమ్ ఝా పార్థివ దేహం హైద్రాబాద్ కు చేరుకున్న తర్వాత, వారి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు అంత్యక్రియల సమయాన్ని, స్థలాన్ని నిర్దారించి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్ కి సిఎం గారు తెలిపారు. సిఎం గారి సూచనల మేరకు అందుకు సంబంధించి ఎకె ఖాన్ సమన్వయం చేస్తున్నారు.

ముకర్రం జా బహదూర్ (వికీమీడియా కామన్స్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *