బీఆర్ఎస్ విజయం కోసం శబరిమలలో సీఎం కేసీఆర్ ఫొటోకు పాలాభిషేకం

హైదరాబాద్, జనవరి 16 (విశ్వం న్యూస్) : భారత రాష్ట్ర సమితి పార్టీ దేశంలో వేగవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శబరిమలలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కరీంనగర్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జీఎస్ ఆనంద్ ఆధ్వర్యంలో శబరిమలలోని అయ్యప్ప స్వామి సన్నిదానం సమీపంలో సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానం చాటుకున్నారు.