శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి జోగు కార్యక్రమం

కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 12 (విశ్వం న్యూస్) : శ్రీ రేణుకా దేవి ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవం లో భాగంగా బుధవారం రోజున కరీంనగర్ పట్టణం లో జోగు కార్యక్రమంలో గౌడ కుల బాంధవు లైన రాచకొండ తిరుపతి గౌడ్ , కొత్తపల్లి సబ్ ఇన్స్పెక్టర్ బుర్ర ఎల్లా గౌడ్ ల వారి ఇంటిలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి జోగు కార్యక్రమం విజయవంతం గా నిర్వహించడం జరిగిందని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ కమిటీ నిర్వాహకులు కోడూరి మహేందర్ గౌడ్ తెలిపారు.

జోగుతో వస్తున్న అమ్మ వారి పూజరులని, సేవకులని, భక్తులని సాధరంగా ఆహ్వానించి, కట్నకానుకలు అందించి తల్లి కృపకు పాత్రులు కాగలరని గౌడ భాంధవులను కొరినారు. జోగు కార్యక్రమంలో గౌడ భాంధవులు వారి వారి పేర్లు ముందుగా నమోదు చేసినచో అదేవిధంగా క్రమపద్ధతిలో జోగు కార్యక్రమం జరుగును. కావున గౌడ సంఘం నాయకులు, కులస్తులు సహకరించాలని కోరినారు. ఈ కార్యక్రమంలో రాచకొండ తిరుపతి గౌడ్ & కుటుంబ సభ్యులు, కొత్తపల్లి ఎస్.ఐ బుర్ర ఎల్లా గౌడ్ & కుటుంబ సభ్యులు, కార్పొరేటర్ మాచర్ల ప్రసాద్ గౌడ్, శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ పూజారులు, గౌడ సంఘం నాయకులు, కులస్తులు తదితరులు పాల్గొన్నారని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి ఆలయ కార్య నిర్వాహకులు కోడూరి మహేందర్ గౌడ్ తెలిపారు.