రాముల వారిని దర్శించుకున్న మంత్రి పువ్వాడ

భద్రాద్రి, జనవరి 2 (విశ్వం న్యూస్) : వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఖమ్మం VDO’s కాలని లోని రామాలయంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారిని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం అర్చకులు స్వామి వారి పట్టు వస్త్రాలతో ఆశీర్వచనం అందించి.. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.