‘బలగం’ మొగిలయ్యను
పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

మంచి వైద్యం అందించాలని నిమ్స్ వైద్యులను ఆదేశించిన మంత్రి
హైదరాబాద్, ఏప్రిల్ 14 (విశ్వం న్యూస్) : ఎన్నో కుటుంబాలను కలుపుతున్న బలగం సినిమాలో నా తోడుగా నా తోడు ఉండి అనే పాట పాడిన బుడగ జంగాల కళాకారుడు, కిడ్నీ సంబంధ సమస్యలతో నిమ్స్ లో చికిత్స పొందుతున్న మొగిలయ్య ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించి వారి కుటుంబానికి భరోసా కల్పించారు.
మోగిలయ్య వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, మంచి వైద్యం అందిస్తున్నాం అని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి మోగిలయ్య ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. వారికి మంచి వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
