అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి, జనవరి 2 (విశ్వం న్యూస్) : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్ లతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ రోజు మొత్తం (69 ) అర్జీలు రాగా, అందులో రెవెన్యూ కు సంబంధించినవి (55) కాగా, మిగతా శాఖలకు చెందినవి (14) ఉన్నాయి. పెద్దపల్లి మున్సిపాలిటీలోని నల్ల పోచమ్మ వాడకు చెందిన రఫియా సుల్తానా, ఆస్మా తమకు రెండు పడక గధుల ఇండ్ల కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా సూపరింటెండెంట్ హెచ్ విభాగానికి రాస్తూ అవకాశం మేర చర్యలు తీసుకోవాలని సూచించారు. పెద్దపల్లికి చెందిన కోట్టె హరీష్ డీగ్రి పూర్తి చేసి బస్టాండ్ సమీపంలో శ్రీ వానాయక ఇంటర్నెట్ జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తున్నానని, తనకు మీ సేవా కేంద్రం మంజూరు చేయాలని కోరగా, అర్హత పరిశీలించి సాధ్యాసాధ్యాల మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్, జిల్లా అధికారులతో కలిసి నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *