జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా
ఉచిత న్యాయ సేవలు, సహాయం

జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా ఉచిత న్యాయ సేవలు, సహాయం

రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్
రాజ్యాంగం ప్రకారం న్యాయ సేవలు పొందడం ప్రతి ఒక్కరి హక్కు
రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ పి. నవీన్ రావు

జిల్లా న్యాయ సేవాధికార సంస్థను వర్చువల్ విధానంలో
ప్రారంభించిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

పెద్దపల్లి, జనవరి 2 (విశ్వం న్యూస్) : ప్రతి ఒక్కరికీ న్యాయం పొందే హక్కును రాజ్యాంగం కల్పించిందని, ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం అందే విధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా ఉచిత న్యాయ సేవలు, సహాయం అందించడం జరుగుతుందని రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లా కేంద్రాల్లోనీ కోర్టు ప్రాంగణాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థలను రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వర్చ్యువల్ విధానం ద్వారా ప్రారంభించారు.
ఈ సందర్భంగా హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తి మాట్లాడుతూ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా పేద ప్రజలు, ఒంటరి మహిళలు, నిరక్ష్యరాస్యులు ఆర్థికంగా వెనకబడిన వారికి ఉచిత న్యాయ సలహా దొరుకుతుందని, ఉచితంగా సేవలు అందుతాయనే విషయం అందరికీ తెలియజేయాలని అన్నారు. దేశంలోని ప్రతి మహిళకు, ఎస్సి / ఎస్టి లకు, కార్మికులకు, దివ్యాంగులకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం పొందే హక్కును కల్పించడం జరిగిందని, ఇది పూర్తి స్థాయిలో అమలు అయ్యేందుకు 1995లో న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడీ 10 జిల్లాల్లో జిల్లాస్థాయి న్యాయ సేవాధికార సంస్థలు ఉన్నాయని, ప్రస్తుతం నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలలో సైతం జిల్లా స్థాయి న్యాయాధికార సేవా సంస్థలను ఏర్పాటు చేయడంలో సంపూర్ణ సహకారం అందించిన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా న్యాయ అధికార సేవా సంస్థల ద్వారా అందించే సేవలను విస్తృతంగా ప్రచారం చేయాలని, పేద ప్రజలు సేవలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ఎం. నాగరాజు మాట్లాడుతూ, కక్షిదారులు అందరూ తమ సమస్యలను న్యాయ సేవాదికార సంస్థను సంప్రదించి పరిష్కరించుకోవచ్చని, సంస్థ సేవలను, అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్. సురేష్ బాబు మాట్లాడుతూ, న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించు ఉచిత సేవలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి ఎ ఒక్కరు నష్టపోకుండా ప్రతి ఒక్కరూ సమాన న్యాయం పొందే విధంగా మీడియా ద్వారా, క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి అర్జున్, జూనియర్ సివిల్ జడ్జిలు రాణి , ప్రియాంక, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ బాబు, గోదావరిఖని బార్ అధ్యక్షలు శైలజ, సుల్తానాబాద్ బార్ అధ్యక్షులు పడల శ్రీరాములు సీనియర్, జూనియర్ న్యాయ వాదులు , కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *