దత్తతకు బాలసదనం బాలిక

దత్తతకు బాలసదనం బాలిక

తిమ్మాపూర్, జనవరి 2 (విశ్వం న్యూస్) : కరీంనగర్ బాలసదనంలో 8 సంవత్సరాలుగా ఉంటున్న చిన్నారి తమిళనాడుకు దత్తతకు వెళ్ళింది. తమిళనాడుకు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత కోసం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆన్లైన్ వెబ్సైట్లో పిల్లల కోసం దరఖాస్తు చేసుకు న్నారు. దేశమంతా ఒకే పోర్టల్ ద్వారా దేశంలోని అన్ని బాలసదనాలలో ఉంటున్న పిల్లలను ఎక్కడి నుంచైనా, ఎక్కడికైనా దత్తత ఇచ్చే అవకాశం ఉండ డంతో ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఆ దంప తుల కల నెరవేరింది. అన్ని ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన తర్వాత అధికారులు కరీంనగర్ బాలసదనంలో ఉంటున్న అనాధ చిన్నారి (13 సంవ త్సరాలు) ని దత్తతకు ఇచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్నన్ ఆధ్వర్యంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు బాలికను దత్తత తల్లిదండ్రులకు అప్పగించారు. ఉత్తర్వు కాపీని వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా సంక్షేమ అధికారి సబిత, సిడబ్ల్యుసి చైర్ పర్సన్ ధనలక్ష్మి, డిసిపిఓ శాంత, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *