ఇసుక లారీలను అడ్డుకున్న
హిమ్మత్ నగర్ గ్రామ ప్రజలు

వీణవంక, ఏప్రిల్ 15 (విశ్వం న్యూస్) : వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో ఇసుక రవాణా ద్వారా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రజలు లారీలను మా గ్రామం నుంచి వద్దు వేరే దారి గుండా తీసుకెళ్లండి అంటూ ఇసుక లారీలను అడ్డుకున్నారు. ఇదే విధంగా జరిగితే అతి వేగంగా ప్రయాణిస్తున్న లారీల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని గ్రామ పాలక వర్గం అండదండల తో గ్రామం నుంచి అతి వేగంగా ప్రయాణిస్తున్న ఇసుక లారీలు మాముల మత్తులో అధికారులు మరియు గ్రామ పాలక వర్గం నిమగ్నమై గ్రామం నుండి ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వడం వలన గ్రామంలోని ప్రజలు రోడ్ల పైకి రాలేని పరిస్థితుల్లో ఉన్నారని వాపోయారు.

ఈ కార్యక్రమంలో లకొట వెంకన్న, మోర్తల రఘువరన్, మారం మల్లారెడ్డి, మ్యాక శ్రీనివాస్, గుంపుల గట్టయ్య, ఇమ్రాన్, సర్దన్ అనీల్, ప్రకాష్, మ్యక వెంకన్న, అలుగువెళ్లి మోహన్ రెడ్డి, లడే రాజు, తదితరులు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.