రంజాన్ సందర్భంగా కేసీఆర్ కిట్ల పంపిణీ

రంజాన్ సందర్భంగా కేసీఆర్ కిట్ల పంపిణీ

పంపిణీ చేసిన కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్
బండ్లగూడ జాగీర్, ఏప్రిల్ 16 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గంధంగూడ ఒకటో వార్డు లోని ఈరోజు మజీద్ ఈ రహమతుల్ అల్ ఆమెన్ మసీదులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పర్వదిన సందర్భంగా కేసీఆర్ కిట్లను స్థానిక కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్ పంపిణీ చేశారు. ఈ సందర్భముగా మాట్లాడుతూ చుటపక్కల నిరుపేదలకు ఈ కిట్లతో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు.

పంపిణీ అనంతరం ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మస్తాన్ బాబు మియా, మమ్మద్ ఫసియుద్దీన్, రషీద్, సలీం, శ్రీనివాస్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ నాగేష్, లక్ష్మణ్, రాజు, జయప్రకాష్ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *