కనీవిని ఎరుగని రీతిలో బోడుప్పల్
కార్పొరేషన్ ఆత్మీయ సమ్మేళనం

- ముఖ్య అతిథులుగా మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి
- మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది, మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్
- మాజీ జెడ్పిటిసి సభ్యులు, పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో సభ సక్సెస్..
బోడుప్పల్, ఏప్రిల్ 17 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలలో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ జెడ్పిటిసి సభ్యులు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం బొమ్మక్ గంగయ్య గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కనివిని ఎరుగని రీతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సురభి వానిదేవి,గౌరవ అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్, సభాధ్యక్షులు, మాజీ జెడ్పిటిసి సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి కెసిఆర్ అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గం కూడా దేశంలోనే నెంబర్ వన్ అని కొనియాడారు.

నన్ను మీరందరూ మొదటిసారిగా మల్కాజిగిరి ఎంపీగా గెలిపించారని, అటు వెంబటే ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగిందని, 2014 సంవత్సరంలో నన్ను మీరందరూ కలిసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటి మినిస్టర్ కేటీఆర్ తదితరులు నాకు మంత్రివర్గంలో అవకాశం కల్పించి, తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా నియమించారని, దీనికి కారణం కథ, కర్మ, క్రియ అన్ని మీరేనని, మీ అందరికీ రుణపడి ఉంటానని, మేడ్చల్ నియోజకవర్గం ప్రజలకు వాచ్మెన్ గా పనిచేస్తానని బల్లగుద్ది మరి చెప్పారు. నా నియోజకవర్గ పరిధిలో మూడు కార్పొరేషన్లు, పది మున్సిపాలిటీలు, సర్పంచులు, ఎంపీటీసీలు 95% బీఆర్ఎస్ పార్టీ సభ్యులే ప్రజాప్రతినిదులుగా గెలిచారని, నేనే వారందరికీ బి ఫార్మ్స్ ఇచ్చానని, ఇంత ఘనత సాధించిన ఏకైక నియోజకవర్గం, ఎమ్మెల్యే నేనేనని తెలియజేశారు. రానున్న జనరల్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి ముచ్చటగా విజయకేతనం ఎగరవేస్తుందని, మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్, మేడ్చల్ నియోజకవర్గం లో రెండవసారి ఎమ్మెల్యేగా, నేను మళ్లీ మన ప్రభుత్వం, మన పాలకవర్గాలే ఉంటాయని, ఏ పార్టీలో కూడా నిలకడ లేదని, ఎవరు వచ్చి కల్లిబొల్లి మాటలు చెప్పిన ప్రజలు నమ్మరాదని తెలిపారు.

మరో అతిధి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన గత తొమ్మిది సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు దూసుకెళ్తున్నాయని, కనీవిని ఎరుగని రీతిలో ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 24 గంటల కరెంటు, ఇంటింటికి మంచినీరు, దళిత బంధు, రైతుబంధు పెన్షన్లు తదితర కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని, ప్రజలు బీఆర్ఎస్ పార్టీని దీవించాలని పేర్కొన్నారు. నిండుకుండలా ఇంత క్రమశిక్షణతో విజయవంతం చేసిన ఈ సభను చూస్తుంటే ముచ్చటేస్తుందని, ఈ సభకు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా దిగ్విజయం చేసిన పార్టీ అధ్యక్షులు, మాజీ జెడ్పిటిసి సీనియర్ పార్టీ నాయకులు మంద సంజీవరెడ్డిని ప్రత్యేకించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ కార్పొరేటర్లు కో ఆప్షన్ సభ్యులు డివిజన్ పార్టీ ఇన్చార్జీలు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీనియర్ నాయకులు మహిళా నాయకురాల్లు యువత కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలు హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
