శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి జోగు కార్యక్రమం

కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 16 (విశ్వం న్యూస్) : శ్రీ రేణుకా దేవి ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవం లో భాగంగా ఆదివారం రోజున కరీంనగర్ పట్టణం – రాంనగర్, విద్యానగర్, సంతోష్ నగర్, శ్రీహరినగర్ లో జోగు కార్యక్రమంలో గౌడ కుల బాంధవుల వారి ఇండ్లలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి జోగు కార్యక్రమం విజయవంతం గా నిర్వహించడం జరిగిందని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ కమిటీ నిర్వాహకులు కోడూరి మహేందర్ గౌడ్ తెలిపారు. జోగుతో వస్తున్న అమ్మ వారి పూజరులని, సేవకులని, భక్తులని సాధరంగా ఆహ్వానించి, కట్నకానుకలు అందించి తల్లి కృపకు పాత్రులు కాగలరని గౌడ భాంధవులను కొరినారు. జోగు కార్యక్రమంలో గౌడ భాంధవులు వారి వారి పేర్లు ముందుగా నమోదు చేసినచో అదేవిధంగా క్రమపద్ధతిలో జోగు కార్యక్రమం జరుగును. కావున గౌడ సంఘం నాయకులు, కులస్తులు సహకరించాలని కోరినారు.

ఈ కార్యక్రమంలో సుదగొని సర్వయ్య గౌడ్ & కుటుంబ సభ్యులు, మారుతి గౌడ్ & కుటుంబ సభ్యులు, రవిగౌడ్ & కుటుంబ సభ్యులు, శ్యామ్ గౌడ్ & కుటుంబ సభ్యులు, గొడిపెల రమేష్ గౌడ్, బుర్ర పరశురాం గౌడ్ & కుటుంబ సభ్యులు, నాగుల కిరణ్ గౌడ్ & కుటుంబ సభ్యులు, ఓల్లాల ఎల్లా గౌడ్ & కుటుంబ సభ్యులు, రాజమనోహర్ గౌడ్ కుటుంబ సభ్యులు,శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ పూజారులు, గౌడ సంఘం నాయకులు, కులస్తులు తదితరులు పాల్గొన్నారని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి ఆలయ కార్య నిర్వాహకులు కోడూరి మహేందర్ గౌడ్ తెలిపారు.