ముస్లింలకు రంజాన్ దుస్తుల పంపిణీ

- మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మరియు ఎమ్మార్వో బండి రాజేశ్వరి ఆధ్వర్యంలో…
జమ్మికుంట, ఏప్రిల్ 18 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణంలోని రెవెన్యూ అధికారుల మరియు నగర పంచాయతీ చైర్మన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ముస్లిం మైనార్టీలకు పవిత్రమైన రంజాన్ మాసం దుస్తుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట పట్టణ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మరియు ఎమ్మార్వో బండి రాజేశ్వరి ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోని జమ్మికుంట పట్టణ మరియు చుట్టుపక్కన గ్రామాల మజీద్, అధ్యక్షులు, మరియు కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు.

మున్సిపల్ చైర్మన్, ఎమ్మార్వో బండి రాజేశ్వరి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రతి రంజాన్ కు ముస్లిం సోదరులకు దుస్తుల పంపిణీ మరియు ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. కౌన్సిలర్ దిద్ది రాము, మరియు పాతకాల రమేష్, రాయికట్ రవి, గాజుల భాస్కర్ తదితరులు కౌన్సిలర్లు పాల్గొన్నారు.