మానవత్వం చాటుకకున్న బోడుప్పల్
మల్లయ్య నగర్ మిత్ర బృందం

- కరోనా, ఫ్లడ్స్, ప్రతిక్షణం మీడియా అందించిన కృషిని అమోఘం: డాక్టర్ వీరమళ్లు
బోడుప్పల్, ఏప్రిల్ 18 (విశ్వం న్యూస్) : ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నాలుగవ మూల స్తంభాలుగా నిలిచిన మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన పీర్జాదిగూడలోని అమ్మఒడి చిన్న పిల్లల అనాధాశ్రమంలో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం అందరికీ తెలిసిందే.. ఈ అగ్ని ప్రమాదంలో ఆశ్రమంలో దాతలు అందించిన నిత్యావసర సరుకులు,పిల్లల పుస్తకాలు,వివిధ రకాల మౌలిక వస్తువులు కాలి బూడిద అయ్యాయి అనే మీడియా కథనాలు చూసి.. చలించిన సామాజిక కార్యకర్త డాక్టర్ లక్ష్మీ వీరమల్లు వారి మిత్రుల తో చర్చించడం జరిగింది. అనంతరం సామాజిక కార్యకర్తలు చంద్ర శేఖర్, సమత యాదవ్ లతో ఆశ్రమాన్ని సందర్శించి,నిర్వాహకులను కలిసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
ఆ మరుసటి క్షణం నుండి అమ్మ ఒడి అనాధాశ్రమం అనాధ పిల్లలకు ఏదైనా చేయాలనే తపనతో మిత్రులు కే చంద్ర శేఖర్, ఇంద్ర సేనా రెడ్డి, రామిరెడ్డి,తిరుమలేష్ ,నాగమయ్య, నరేష్, రామాంజనేయులు, అశోక్, రాజు, బాలకృష్ణ, నాగభూషణం,స్వామి,అంజయ్య, మహేష్, గాంధీ, సందీప్, చంద్ర శేఖర్, వెంకటేష్, రమేశ్, కే సందీప్, డాక్టర్ లక్ష్మి వీర మల్లు,సంగీత రమేష్ ల ఆధ్వర్యంలో సంఘటనపై స్పందించి అందించిన విరాళాలు. రూ.33.960 (ముప్పై మూడు వేల తొమ్మిది వందల అరవై ) రూపాయలతో బియ్యం,కిరాణ సరుకులు,కూరగాయలు,బెడ్ సీట్లు, బ్లాంకెట్స్ స్వయంగా ఆశ్రమంకి వెళ్ళి పిల్లలు అందరితో కాసేపు గడిపారు. అనంతరం నిర్వాహకులకు మనో దైర్యం ఇచ్చి పిల్లల చదువుల విషయంలో కూడా సహకారం అందిస్తామని మల్లయ్య నగర్ మిత్ర బృందం పిల్లలకు హామీ, దైర్యం రెండు ఇచ్చారు.

ఈ మేరకు నిర్వాహకులు మోహన్ ని శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి వీరమల్లు మాట్లాడుతూ ఈదే మిత్రుల సహకారంతో కరోనా వైరస్ సమయంలో కూడా ఐదు అనాధాశ్రమాలు, వృద్ధుల ఆశ్రమాలలో కూడా 3 నెలల పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నరు. అప్పుడు కూడా మీడియా ప్రతినిధుల సహకారం మరువ లేనిదనీ, రా చెరువు పరిరక్షణ కోసం కూడా ప్రతీ విషయంలోనూ మీ కృషి ఎనలేనిదనీ మీడియాను కొనియాడారు. ఇలాంటి సంఘటన సందర్భం లో స్పందించి సాహాయం అందించిన మిత్రులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.