ఘనంగా పోచమ్మ బోనాలు

కరీంనగర్ పట్టణ గౌడ సంఘం కులస్తుల అధ్వర్యంలో
కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 24 (విశ్వం న్యూస్) : ఆదివారం రోజు కరీంనగర్ పట్టణంలో శ్రీరేణుక ఎల్లమ్మ దేవి బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా గౌడ సంఘం కులస్తుల అధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అధ్వర్యంలో సంతోష్ నగర్, రాం నగర్, మంకమ్మతోట, సప్తగిరి కాలని, గణేష్ నగర్, తిర్మల్ నగర్, కరీంనగర్ పాత బజార్, కరీంనగర్ ఓల్డ్ సిటీ, లక్ష్మినగర్, రాఘవేంద్ర నగర్, కోతిరాంపూర్, హోసింగ్ బోర్డ్, ఆటో నగర్, పోచమ్మ వాడ, తదితర కాలని గౌడ సంఘం కులస్తులతో డప్పు , వాయిద్యాల తో పోచమ్మ బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్, మాచర్ల ప్రసాద్ గౌడ్, పంజాల సురేందర్ గౌడ్, పంజాల అడ్వకేట్ విజయ భాస్కర్ గౌడ్, తాల్లపల్లి హరి కుమార్ గౌడ్, కోడూరి మహేందర్ గౌడ్, బత్తిని సత్యం గౌడ్, బుర్ర జగదీశ్వర్ గౌడ్, బుర్ర పరశురాం గౌడ్, కలర్ సత్తన్న, సుదగొని ఆంజనేయులు గౌడ్, సుదగోని ఎస్.ఎల్.గౌడ్, గడ్డపార వెంకన్న గౌడ్, నాగుల కిరణ్ గౌడ్, కోడూరి తిరుపతి గౌడ్, కోడూరి హరికృష్ణ గౌడ్, గొడిషేల భూమయ్య – రమేష్ గౌడ్, తదితర గౌడ బాంధవులందరు అధిక సంఖ్యలో హాజరై పోచమ్మ బోనాల జాతర ఉత్సవాన్ని విజయవంతం చేసినందుకు శ్రీరేణుక ఎల్లమ్మ దేవి ఆలయ నిర్వాహకులు కోడూరి మహేందర్ గౌడ్, గౌడ సోదరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
