52 ఏళ్లయింది నాకు ఇల్లు
లేదు: రాహుల్ గాంధీ

న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 23 (విశ్వం న్యూస్) : నా చిన్నప్పుడు 1977లో ఎన్నికలు వచ్చాయి, ఎన్నికలంటే నాకేంటో తెలియదు. అప్పుడు నా వయస్సు 6 సంవత్సరాలు. ఆ సందర్భంలో మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాము, అమ్మని అడిగాను ఏమైంది అమ్మ..! అమ్మ సమాధానం ఇస్తూ ఇల్లు విడిచి వెళుతున్నామని చెప్పింది..! ఎందుకమ్మా అని మళ్లీ అడిగా..! అప్పుడు అమ్మ సమాధానమిస్తూ ఇది మన ఇల్లు కాదు, ప్రభుత్వ (క్వార్టర్స్) ఇళ్ళు అని చెప్పింది. అప్పటిదాకా నేను ఉంటున్న ఇల్లు మాది అనుకున్నా… అమ్మ సమాధానం విని ఆశ్చర్యపోయాను.
కర్నాటక ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ… తన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని, అధికార బంగ్లా ఖాళీ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వందలాది మంది తమ ఇంటికి రావాలని, తమ ఇళ్లు తీసుకోవాలని తనకు లేఖలు రాశారని గుర్తు చేసుకున్నారు. తనకు ఇళ్లు అవసరం లేదని, దేశమే తన ఇల్లు ఇని పేర్కొన్నారు.