దళిత గిరిజన జర్నలిస్టులకు, ఇంటి స్థలాలు,దళిత బంధు పథకం అందివ్వాలి

దళిత గిరిజన జర్నలిస్టులకు,
ఇంటి స్థలాలు, దళిత బంధు
పథకం అందివ్వాలి

ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్
ఉపాధ్యక్షులు గుండ్ల కుమారస్వామి పిలుపు
బోడుప్పల్, ఏప్రిల్ 26 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత గిరిజన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని, దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకం వర్తింపచేయాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండ్ల కుమారస్వామి కోరారు.
బుధవారం బోడుప్పల్ కార్పొరేషన్ ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన జిల్లా ప్రతినిధుల సమావేశంలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కన్వీనర్ గుండ్ల కుమార స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజన జర్నలిస్టుల సమస్యలను వారి ఆర్థిక పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకొని జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇస్తామని అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్న వాటి గురించి ఒక మాట అయినా ఎత్తడం లేదని తెలిపారు. దళితుల అభివృద్ధి కోసం దళిత బంధు పథకం అమలు చేస్తున్నప్పటికీ దళిత జర్నలిస్టులకు ప్రత్యేకంగా అమలు చేయడం లేదని అన్నారు.

దళిత జర్నలిస్టులకు ఇంటి స్థలాలు లేదా ఇల్లు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని, దళిత బంధు పథకం ప్రభుత్వం వర్తింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టులు సంతోష్, నరసింహ, దేవా, వినయ్, శివ, అంజి, మహేష్, శ్రీనివాస్ తదతరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *