కరీంనగర్:ఘనంగా శ్రీ రేణుక
ఎల్లమ్మ దేవి బోనాల పండుగ

- గౌడ కులస్తుల ఇలవేల్పు –
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి

కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 25 (విశ్వం న్యూస్) : మంగళవారం రోజు శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి బోనాల పండుగ (సిద్దోగం) ఉత్సవాలు కరీంనగర్ పట్టణ గౌడ్ కులస్తులు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ , మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్, ఆధ్వర్యంలో ఉరుములు, మెరుపులు, చిరు జల్లుల మధ్య శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి బోనాల పండుగ ఘనంగా జరిగాయి.

మంగళవారం రాంనగర్ నుండి బోనాలు సాయంత్రం బయలు దేరి మంకమ్మ తోట,సప్తగిరి కాలని, నుండి టౌన్ పోలీస్ స్టేషన్, తెలంగాణ చౌకు గీతాభవం మీదుగా అక్కడ నుండి బస్టాండ్ మీదుగా వన్ టౌన్ చౌరస్తా వరకు అన్ని బోనాలు కలుపుకొని కమాన్ ఏరియా, మిగతా ఏరియాల నుంచి వచ్చిన బోనాలు కమన్ చౌరస్తా దగ్గర కలిసి సాంస్కృతి కార్యక్రమాలు , వీఐపీలకు సన్మాన కార్యక్రమం చేయడం జరుగింది.

కుల పెద్ద మనిషి మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ వారి ఇంటి నుండి ఏడు అంతస్తుల బోనం కుల సాంప్రదాయం ప్రకారం తీసుకురావడం జరిగింది. పాత బజార్, లక్ష్మి నగర్, గణేష్ నగర్, రాఘవేంద్ర నగర్ వివిధ ఏరియాల నుండి వచ్చిన బోనాలను కలుపుకొని కమాన్ చౌరస్తా నుండి బయలుదేరి కోతి రాంపూర్ మీదుగా కరీంనగర్ – గోదావిఖని బైపాస్ నుండి శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయం వరకు బోనాల పండుగ జాతర ఊరేగింపు గౌడకులస్తుల తో కలిసి డప్పు చప్పుడు, కొలాటాలతో, శివ పార్వతులు, పోతరాజులు, శివసత్తుల వేషధారణలతో, వాయిద్యాలతో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయానికి రాత్రి 12 గంటలకు చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. నేడు ఆలయ ప్రాంగణంలో దాదాపు 5 వేల మంది కి బోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కోడూరి సత్యనారాయణ గౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్, రాచకొండ తిరుపతి గౌడ్, ఆలయ పూజారులు, ఆలయ సిబ్బంది, సుధాగొని ఆంజనేయులు, సుధగొని ఎస్.ఎల్.గౌడ్, మాచర్ల ప్రసాద్ గౌడ్,గుగ్గిళ్ళ శ్రీనివాస్ గౌడ్, కార్పొరేట్ భూమా గౌడ్, తాళ్లపల్లి హరికుమార్ గౌడ్, పంజాల సురేందర్ గౌడ్, పంజాల విజయ భాస్కర్ గౌడ్ (అడ్వకేట్), కోడూరి హరికృష్ణ గౌడ్, గడ్డపార వెంకన్న గౌడ్, ఆరే రవి గౌడ్, కోడూరి మహేందర్ గౌడ్ (అడ్వకేట్), కోడూరి లక్ష్మణ్ గౌడ్,తాళ్లపల్లి హరిబాబు, గోపనాయకులు బుర్ర జగదీశ్వర్ గౌడ్, నినాదం తెలుగు దినపత్రిక బ్యూరో చీఫ్ బుర్ర పరశురాం గౌడ్, బత్తిని కిషోర్ గౌడ్, బత్తిని సత్యం, బత్తిని రాజు గౌడ్, న్యాలం అంజయ్య, వొల్లాల శ్రీనివాస్, నాగుల కిరణ్ గౌడ్, గౌడ పెద్దలు, గౌడ సంఘం నాయకులు, కులస్తులు, గౌడ యువకులు తదితరులు పాల్గొన్నారని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయం నిర్వాహకులు కోడూరి మహేందర్ గౌడ్ తెలిపారు.
