నేను నా కుటుంబం ఎల్లవేళల
కేసీర్ కి రుణపడి ఉంటాము

ఘణ ఎంటర్ప్రైజెస్ & బ్యాటరీస్ యజమాని ప్రవ శ్రీనివాస్
మొదటి వార్షికోత్సవం సందర్భంగా హాజరైన మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు
జమ్మికుంట, ఏప్రిల్ 27 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో దళిత బంధు పథకం ద్వారా ఏర్పాటు చేసిన ఘణ ఎంటర్ప్రైజెస్ & బ్యాటరీస్విజయవంతంగా సంవత్సర కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా యజమాని ప్రవ శ్రీనివాస్ గారిని అభినందించిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, భారతదేశ చరిత్రలోనే ఎందరో ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు మారిన కూడా దళితుల గురించి ఆలోచన చేసిన ఏకైక నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు, దళితుల అభ్యున్నతి కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొని దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కాబట్టి మీరు ఈ పథకాన్ని సరియైన పద్ధతిలో వినియోగించుకొని మీరు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని తెలిపారు. షాప్ యజమాని ప్రవ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు, ఒక షాప్ లో సాధారణ ఉద్యోగిగా ఉన్న నన్ను ఒక షాప్ కు యజమాని చేశారు వారికి నేను నా కుటుంబం ఎల్లవేళల ఋణపడి ఉంటామని తెలిపారు.