మేము తోలు తీస్తాం

- కౌశిక్ రెడ్డిపై విరుచుకుపడిన
పత్తి కృష్ణారెడ్డి
జమ్మికుంట, ఏప్రిల్ 28 (విశ్వం న్యూస్) : విషయ, విజ్ఞాన పరిపక్వత లేని వ్యక్తి కౌశిక్ రెడ్డి అని, ఇష్టమున్నట్లు మాట్లాడటం మానుకోకపోతే ప్రజా క్షేత్రంలో గుణపాఠం చెప్తామని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి హెచ్చరించారు. గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పత్తి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. హుజురాబాద్ లో నిర్వహించిన బి.అర్.ఎస్ పార్టీ నియోజక వర్గ ప్లీనరీలో ప్రభుత్వ విప్ ఎం.ఎల్.సి కౌశిక్ రెడ్డి డాంబికంగా ఇతర పార్టీల నాయకులను దుర్బుషలాడుతూ ఇస్టమున్నట్లు నాకెవరూ అడ్డు లేరని పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని, పద్ధతి మర్చుకొక పోతే బాగుండదని హెచ్చరించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం తన రాజ్యమే అంటూ వ్యవస్థలను కించపరుస్తూ, కౌశిక్ రెడ్డి ఎం.ఎల్.సి (సామాజిక సేవా విభాగం)లో అభ్యర్థిత్వాన్ని తిరస్కరించిన విషయం గుర్తుపెట్టకోవాలి అన్నారు. కౌశిక్ రెడ్డి తానే ప్రభుత్వం తనదే రాజ్యం అన్నట్లు వ్యవహరిస్తే ప్రజల మనసుల్లో నీ స్థానం ఎక్కడో అని తెలుసుకోక పోవడం అవివేకం అని అన్నారు. అధికార పార్టీకి ఈ నియోజక వర్గంలో ఒక ప్రజా ప్రతినిధి ఉండాలని కే.సి.అర్ దయతో నువ్ ఎం.ఎల్.సి వి ఐన తరువాత నువ్ చేస్తున్నది ఎంటి అని ప్రశ్నించారు.
గత ఉప ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చవలసిన బాధ్యతను తీసుకో కానీ ఇలా ప్రవర్తించడం వలన నువ్ ఎం.ఎల్. ఏ కాదు కద వార్డు మెంబర్ కూడా గెలవలేవు కౌశిక్ రెడ్డి ని
దుయ్యబట్టారు. కౌశిక్ రెడ్డి తన వాహనం ముందు ఒక ఎస్కార్ట్ వెనుక ఒక ఎస్కార్ట్ వాహనం ఉండాలని పోలీసులకు హుకుం జారీచేయడం నియంత ప్రవర్తన కనబడుతుంది. రైతుల పరిస్థితి అఘోరంగా ఉంటే బి.అర్.ఎస్ సంబరాలు చేసుకుంటుంది. ఇది సిగ్గుచేటని సి.ఎం ప్రకటించిన పంట నష్టం వెంటనే రైతులకు అందాలని, రైతులకు అన్ని సౌకర్యాలు ఐ.కే.పి సెంటర్ లలో కల్పించాలని లేనియెడల కాంగ్రెస్ పార్టీ తరుపున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు మేకల తిరుపతి, వినోద్ రెడ్డి, మహిళ పట్టణ అధ్యక్షురాలు పూదరి రేణుక, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సజ్జు, ఎన్.ఎస్. యు. ఐ జిల్లా సెక్రెటరీ ఇమ్రాన్, మాజీ మార్కెట్ డైరెక్టర్లు సుంకరి రమేష్ , సలీం, పూధరి శివ, పింగిలి రాకేష్, చిట్యాల శంకర్, మంద అశోక్, మేకల సురేష్, మూడేత్తుల మల్లేశం, గంగారం మహేష్, మద్దమల్ల రవి, చంచల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.