
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విశ్వం న్యూస్) :
- ఈనెల 30 తెలంగాణ సమీకృత కొత్త సచివాలయం ప్రారంభ వేడుకలు..
- సూర్యోదయం [ఉ. 6 గంటల] తరవాత సచివాలయంలో సుదర్శన యాగం ప్రారంభం.
- మధ్యాహ్నం 1 గంట 20 నుంచి 1 గంట 30 నిమిషాల మధ్య యాగం పూర్ణాహుతి.
- తరవాత సమీకృత కొత్త సచివాలయం రిబ్బన్ కటింగ్.
- ఆ వెంటనే 6 వ అంతస్తులోని తన ఛాంబర్లో కొలువుదీరనున్న ముఖ్యమంత్రి కేసీఆర్.
- మధ్యాహ్నం 1 గంట 58 నిమిషాల నుంచి 2 గంటల 04 నిమిషాల మధ్యకాలంలో తమతమ ఛాంబర్లలో కొలువుదీరనున్న వివిధ శాఖల మంత్రులు.
- మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు కొత్త సచివాలయం ప్రాంగణంలో గ్యాదరింగ్!
- గ్యాదరింగ్ ను ఉద్దేశించి ప్రసంగించనున్న సీఎం కేసీఆర్!
- ఆ తరవాత తమతమ స్థానాల్లో కొలువుదీరనున్న అధికారగణం, ఇతర ప్రభుత్వ యంత్రాంగం.
- ఏప్రిల్ 30 వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న సమీకృత కొత్త పరిపాలనా సౌధం!
- ఆ రోజు నుంచి అక్కడే పూర్తిస్థాయి విధులు నిర్వర్తించనున్న సీఎం, సీఎంఓ అధికార యంత్రాంగం, మంత్రులు.