తెలంగాణ వైట్ హౌస్‌

  • కొత్త పరిపాలన సౌధం తెలంగాణ ప్రగతికి చిహ్నంగా మారుతోంది. వైట్ హౌస్‌ను తలపించేలా తెలంగాణ సచివాలయం నిర్మాణం అవుతోంది

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విశ్వం న్యూస్) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కొత్త సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో తెలంగాణ సచివాలయం రూపుదిద్దుకుంటోంది.

సచివాలయ భవనసముదాయం ముందున్న 2 ఎకరాల ఖాళీ స్థలంతోపాటు ల్యాండ్‌ స్కేపింగ్‌, గ్రీనరీ పనులు కూడా అద్భుతంగా ఉన్నాయి. సందర్శకుల గదులు, గ్రిల్స్‌, రెడ్‌ స్టోన్‌, మురుగునీటిపారుదల పనులను అత్యాధునిక టెక్నాలజీతో చేపడుతున్నారు. సచివాలయానికి వచ్చే విదేశీ ప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సందర్శకులకు సౌకర్యవంతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *