గీత కార్మికునికి తీవ్ర గాయాలు

ఈ విషయంపై స్పందించిన గౌడ సంఘం జిల్లా ఉపాదక్షులు రంజిత్
వీణ వంక, ఏప్రిల్ 29 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా వీణ వంక మండలం చల్లుర్ గ్రామానికి చెందిన బొంగొని సదయ్య ( 45 ) తాటి చెట్టు వద్ద తీవ్ర గాయాలతో పడి నపుడు తోటి గీతా కార్మికులు హాస్పిటల్
కు తీసుకవెళ్ళడం జరిగింది. బొంగోని సదయ్యా పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
ఈ విషయం స్పందించిన సర్వాయి పాపన్న గౌడ సంఘం జిల్లా ఉపాదక్షులు రంజిత్ మాట్లాడుతూ.. తీవ్ర గాయాలు ఐన బొంగొని సదయ్య వద్ధకు వెళ్లి పరామర్శించి అతని పరిస్థితిని గమనిస్తాం అని తెలిపారు.
విశ్వం న్యూస్ సూచన (తాటి కార్పొరేషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం IAS గారికి )
గీతా కార్మికునికి తీవ్ర గాయాలు ఐతే ప్రభుత్వం నుండి రూ: 15,000 వేల రూపాయలు అందుతాయి.
దురదృష్టవశాత్తూ మరణిస్తే రూ 5 ,00,000/- లక్షల రూపాయలు ఇస్తుంది. ఒక నెల తరువాత కార్పొరేషన్ నుండి గీతా కార్మికులకు అందే పరిహారం హాస్పిటల్లో తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉండే గౌడన్నలకు ఆమాత్రం ఆర్థిక సహాయం ఐనా వెంటనే అందితే వారికి ఉపశమనంగా ఉంటుందని చిన్న సూచన మాత్రమే.