పర్మినెంట్ చేస్తారా…
పస్తులుండమంటారా…?

- జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిరవధిక సమ్మె
- ప్రొబేషనరీ సమయం పూర్తైనా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు
- 3 సంవత్సరాల తరువాత పర్మనెంట్ చేస్తానన్న ప్రభుత్వం
- నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపిన వీణవంక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాహెబ్ హుస్సేన్
వీణవంక, ఏప్రిల్ 29 (విశ్వం న్యూస్) : వీణవంక మండలంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం ముందు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్నటువంటి దీక్షకు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ సంపూర్ణ మద్దతు తెలిపారు.
అనంతరం సాహెబ్ హుస్సేన్ మాట్లాడుతూ గ్రామాల్లో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న కార్యదర్శులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం చాలా బాధాకరం అని వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించేటప్పుడు మూడు సంవత్సరాల కాల పరిమితి అనంతరం రెగ్యులరేషన్ చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నేటికీ వారి యొక్క డిమాండ్ ను నెరవేర్చకపోవడం చాలా సిగ్గుచేటని, ఇప్పటికైనా వారి కుటుంబాలు రోడ్డున పడకుండా తక్షణమే వారిని రెగ్యులరేషన్ చేసి వారికి ప్రభుత్వపరంగా అందేటువంటి జీతభత్యాలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండి సాహెబ్ హుస్సేన్ గారు డిమాండ్ చేశారు.
వారి యొక్క దీక్షకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ రాబోయే రోజుల్లో పంచాయతీ కార్యదర్శులు ఎలాంటి నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన మేము తోడుంటాము వారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాడి రాజిరెడ్డి, చదువు జైపాల్ రెడ్డి, ఎండి అన్వర్, మండల రాజయ్య, ఎండి రజాక్, పంచాయతీ కార్యదర్శులు అంజిరెడ్డి, వీర ప్రతాప్, ఎండి రఊఫ్, కృపారాణి మహేందర్ రెడ్డి, సంపత్, తదితరులు పాల్గొన్నారు.