కిక్ బాక్సింగ్‌లో జాతీయ స్థాయికి
సెలెక్టైన ఆర్టీసి డ్రైవర్
కుమారుడు పుట్ట శ్రీనాథ్

పీర్జాదిగూడ, మే 2 (విశ్వం న్యూస్) : మంచిర్యాల జిల్లాలోని గత నెల 29, 30వ తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023 పోటీలలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన క్రీడాకారులు పాల్గొని తమ అత్యున్నత ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్స్ సాధించారని యాదాద్రి భువనగిరి జిల్లా కిక్ బాక్సింగ్ కోచ్ మామిడాల శ్రీనివాస్ తెలిపారు. పథకాలు సాధించిన వారిలో భువనగిరి పట్టణం హనుమాన్ వాడకు చెందిన పుట్ట రామచందర్ ఆర్టీసీ డ్రైవర్ రెండవ కుమారుడు పుట్ట శ్రీనాథ్ లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

69 కేజీల విభాగం పాయింట్ ఫైట్ లో గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ బ్రదర్ విన్సెంట్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ జయంత్ రెడ్డి, పిఈటి ప్రవీవ లు జాతీయ స్థాయికి ఎంపికైనటువంటి పుట్ట శ్రీనాధుని ఘనంగా సత్కరించారు.అలాగే బాలికల జూనియర్ 38 కేజీల విభాగంలో పంగ సాత్విక మ్యూజికల్ ఫామ్ లలో మొదటి బహుమతి గోల్డ్ మెడల్ సాధించారు. వీరిద్దరూ జులైలో 1 నుండి 5 వరకు పంజాబ్ లో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారని కోచ్ శ్రీనివాస్ తెలిపారు.
రాష్ట్రస్థాయి కరాటే టోర్నమెంట్లో జాతీయస్థాయి సెలెక్ట్ అయిన ఆర్టీసీ డ్రైవర్ ఉప్పల్ డిపోలో పనిచేస్తున్న పి రామచందర్ (211712) కుమారుడైన పుట్ట శ్రీనాథ్ జాతీయస్థాయికి సెలెక్ట్ అయ్యాడు. ఆతడు చిన్నప్పటినుండి కరాటే చాలా ఇష్టంగా నేర్చుకొని, భువనగిరి యాదాద్రి జిల్లా నుండి జాతీయస్థాయిలో సెలెక్ట్ అవడం గొప్పగా భావిస్తున్నామని, తండ్రి ఆర్టీసీ డ్రైవర్ విధులు కొనసాగిస్తూ కుమారునికి ప్రత్యేక శిక్షణ ఇస్తూ కరాటాలో నేర్పడం జరిగిందని, దీనికి ఉప్పల్ డిపోలో కార్మికులందరూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది.