ఘనంగా వీడ్కోలు సమావేశం

జమ్మికుంట, మే 7 (విశ్వం న్యూస్) : ఈరోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జమ్మికుంట చీఫ్ మేనేజర్ గా పని చేస్తున్న శ్రీ కె రాజేష్ గారికి నంద్యాల బ్రాంచ్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా వైభవ్ కాటన్ యందు వీడ్కోలు సమావేశం జరిగింది. వీడ్కోలు సందర్భంగా జమ్మికుంట కాటన్ మిల్లర్స్ మరియు ట్రేడర్స్ హాజరయ్యారు మరియు కొత్తగా వచ్చిన యు బి ఐచీఫ్ మేనేజర్ బి దొరస్వామి నాయక్ గారికి స్వాగతం పలుకుతూ వీడ్కోలుపై వెళుతున్న కే.రాజేష్ గారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది .
ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ బ్రాంచిని ఎంతో అభివృద్ధి చేయడం ప్రజలతో మమేకంగా మాట్లాడడం డిపాజిట్లు గురించి సేకరించడం ప్రజల కష్టం తెలుసుకొని విసుకు చెందకుండా ప్రతి ఒక్క కష్టమర్ తోని వారికి కావలసిన పనిని త్వరగా ముగిస్తూ బ్రాంచ్ ని చాలా ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ కాటన్ వ్యాపారలకు ముఖ్యంగా రైతులకు ఇబ్బంది పడకుండా క్యాష్ సరిపోయే విధంగా ఈ మేనేజర్ గారు చేయడం వ్యాపారం చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి మేనేజర్ ఈ బ్రాంచ్ కి రావడం జమ్మికుంట చేసిన అదృష్టమని కొందరు వ్యాపారులు అన్నారు.
అదేవిధంగా కొత్తగా వచ్చిన మేనేజర్ కూడా ఆ వ్యాపారులందరికి సహకరించాలని కోరడం జరిగింది. ఈ వీడ్కోలు సమావేశానికి ప్రముఖ వ్యాపారులు ముక్క శివకుమార్, బచ్చు వీర్లింగం అండ్ బ్రదర్స్, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అయిత యుగంధర్, మరియు అయిత మోహన్, నగునూరు రవీందర్,ముక్క శ్రీనివాస్, రావికంటి బాబయ్య, సాగర్ మరియుకిషన్ హోండా షోరూం ఎండి ప్రసాదు, జుగురు సదానందం, ఆకుల రాజయ్య మరియు యూనియన్ బ్యాంక్ జమ్మికుంట స్టాప్ అందరూ హాజరు అయ్యారు.