ఏజే గ్రాండ్ హోటల్ ప్రారంభించిన
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

- రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ సీనయర్ నాయకులు ఎంఎ ముజీబ్
- అజ్జు భాయ్ ఆధ్వర్యంలో ఎజే గ్రాండ్ హోటల్ ప్రారంభం
- జిహీచ్ఏంసి మాజీ మేయర్ బొంతు, పిఏంసి మేయర్ జేవియర్ హాజరు
- ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, కార్పొరేటర్లు, నేతలు హాజరు
పీర్జాదిగూడ, మే 7 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్, చెంగిచెర్ల క్రాస్ రోడ్, పిల్లర్ నెంబర్ 126, వరంగల్ హైవే మీదుగా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంఏ ముజీబ్ తనయుడు ఏంఏ అజ్జూ భాయ్ ఆధ్వర్యంలో ఏజే గ్రాండ్ హోటల్ అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరై ఏజే గ్రాండ్ హోటల్ ముఖద్వారాన్ని రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఏంఎ ముజీబ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారని, బీఆర్ఎస్ పార్టీలో ముజీబ్ లాంటి ముఖ్య నాయకులు పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంతో బలం చేకూరుస్తాయని, ఆయన ఆధ్వర్యంలో ఆయన తనయుడు అజ్జు బాయ్ ఏజె గ్రౌండ్ హోటల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, మేడిపల్లి మండలం వరంగల్ హైవే చెంగిచెర్ల ప్రాంతంలోని ప్రజలందరూ అదృష్టవంతులని, వాళ్ళందరికీ ఒక రుచికరమైనటువంటి బిర్యాని సెంటర్ ను ఏర్పాటు చేయడం ఈ ఏరియా ప్రజలందరూ అదృష్టవంతులు అని కొనియాడారు.
రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ లు మాట్లాడుతూ ఏజే గ్రాండ్ హోటల్ రుచికరమైనటువంటి వంటలతో పాటు రోజు రోజు వారి హోటల్ బిజినెస్ చక్కగా కొనసాగాలని, ఈ పరిధిలోని ప్రజలందరికీ చక్కటి బిర్యాని తదితర ఆహారాన్ని అందజేయాలని, వారికి కూడా వ్యాపారం మంచిగా అభివృద్ధి చెందాలని సూచించారు. పీర్జాది గూడ మేయర్ జక్క వెంకటరెడ్డి, డిప్యూటీ కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్ అనంతరెడ్డి మాట్లాడుతూ ఏజే గ్రాండ్ హోటల్ ను ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ముజీబ్ తనయుడు ఆజ్జు భాయ్ ని ప్రత్యేకించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో మేడిపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవర్ధనగిరి, తెలంగాణ రాష్ట్ర భిషప్ విల్సన్ సింఘం,బిషప్ రత్నం, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు హైమద్ ఖాన్, మాజీ ఉపసర్పంచ్ కొత్త రవి గౌడ్ ,జాగృతి సీనియర్ నాయకులు షబ్బీ, కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్, పీర్జాదిగూడ సీనియర్ నాయకులు సంజీవరెడ్డి, పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కవిడ కుమార్,తార్నాక అధ్యక్షులు సలీం,సత్యనారాయణ, ఆల్ పార్టీస్ నాయకులు, కార్యకర్తలు, యువత, ఏజే గ్రాండ్ హోటల్ మేనేజ్మెంట్, సిబ్బంది పోలీస్ అధికారులు,వారి సిబ్బంది పీర్జాదిగూడ కార్పొరేషన్ పాలకవర్గం సభ్యులు ప్రజా ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.