
దలపత్, మే 7 : నాన్నా నువ్వెందుకు లేవడం లేదు? నాకేమీ వద్దు ప్లీజ్.. లే నాన్నా!” అంటూ ఉగ్రదాడుల్లో హతమైన పారాట్రూపర్ నీలంసింగ్ ముఖాన్ని చేతితో తాకుతూ పదేళ్ల చిన్నారి పావన రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది.

నీలంసింగ్ శవపేటిక పక్కనే నిలుచున్న వందన భర్త ముఖాన్ని రెండు చేతులతో పట్టుకొని కన్నీరుమున్నీరు అయ్యారు. ఏడేళ్ల కుమారుడు అంకిత్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జమ్మూకశ్మీర్ లోని దలపత్ గ్రామంలో శనివారం నీలంసింగ్ అంత్యక్రియలు జరిగాయి.

జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులను ఏరివేసే ఆపరేషన్లో శుక్రవారం ఉగ్రవాదులు జరిపిన పేలుడులో మరణించిన ఐదుగురు జవాన్లలో హవల్దార్ సింగ్ కూడా ఉన్నారు.
