పానకంలో పుడక ‘బండి సంజయ్’

పానకంలో పుడక ‘బండి సంజయ్’

మల్యాల సుజిత్ కుమార్,
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు
కరీంనగర్ బ్యూరో, మే 18 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాజకీయాల్లో ఎన్నో అంశాలు ప్రజాసమస్యలు ఉన్నప్పటికి బీజేపీ పార్టీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుంటారని, కాంగ్రెస్ పార్టీ బీఆరెస్ కెసిఆర్ మీద సీరియస్ ఫైట్ చేస్తుంటే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే మధ్యలో ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో బండి సంజయ్ బీజేపీ పానకంలో పుడకలాగా దూరి వారి అస్థిత్వాన్ని కాపాడుకుంటారని ఎద్దేవా చేశారు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మల్యాల సుజిత్ కుమార్.

తెలంగాణ రాష్ట్రంలో బీఆరెస్ పార్టీ కి ప్రత్యామ్నాయం కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో అఖండ విజయంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తున్నారని ఇక తెలంగాణ ప్రజలకు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం అందించే దిశగా కాంగ్రెస్ పార్టీ వేస్తున్న అడుగులకు భయపడి ఇక్కడ బీజేపీ పార్టీ ని కాపాడుకోవాలని బండిసంజయ్ బజరంగ్ దళ్ అంశం తీసుకువచ్చి హిందువులంతా ఏకం కావాలంటూ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని అన్నారు సుజిత్ కుమార్. అసలు హిందువులకు బీజేపీ పార్టీ కి సంబంధం ఏంటని, అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. ఇక ప్రజలు బండి సంజయ్ బీజేపీ వ్యాఖ్యలకు ఆలర్షితులవ్వరని పైగా వీళ్ళ చేష్టలకి ప్రజలంతా నవ్వుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు మల్యాల సుజిత్ కుమార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *