ఎంకేఆర్ డెవలపర్స్ ఆధ్వర్యంలో
సి.సి. కెమెరాల వితరణ

ఇల్లంతకుంట, మే 18 (విశ్వం న్యూస్) : ఎం కె ఆర్ డెవలపర్స్, హైదరాబాద్ వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ మరియు శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానం లకు నిఘా కెమెరాలు (సి.సి.కెమేరాలు) అందించారు. హైదరాబాద్ లో అనేక సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎంకేఆర్ డెవలపర్స్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇల్లంతకుంట మండల పోలీస్ స్టేషన్ కు శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం లకు ఒక్కొక్కరికి 4 కెమెరాలు తో సహా, మొత్తం సి.సి కెమెరాల సెట్ సుమారు లక్ష రూపాయల విలువ గలవి, ఎం కేఆర్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాదాడి కృష్ణారెడ్డి అందించారు.

రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలోని పోలీస్ స్టేషన్ మరియు శ్రీ రామాలయం దేవస్థానం లలో ఈ కెమెరాలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయా మండల ప్రజల సంరక్షణలో మరియు శాంతి భద్రతల నిర్వహణలో ఈ నిఘా కెమెరాలు ఎంతో ఉపయోగపడగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇల్లంతకుంట లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కృష్ణా రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ రాంశర్మ ఎస్సై తోట తిరుపతి ఏఎస్ఐ ఆర్ రవీందర్ రెడ్డి సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆలయ ఈవో కందుల సుధాకర్, మోహన్, రాజయ్య మల్లారెడ్డి అర్చకులు వంశీధర్చార్యులు తదితరులు పాల్గొన్నారు.