పార్లమెంట్ నూతన భవనానికి అంబేద్కర్ గారి పేరు పెట్టాలి
పార్లమెంట్ నూతన భవనానికి
అంబేద్కర్ గారి పేరు పెట్టాలి

- ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్
- అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు
- చొప్పదండి ఎమ్మెల్యే శ్రీ సుంకె రవిశంకర్
కరీంనగర్ బ్యూరో, మే 19 (విశ్వం న్యూస్) : గంగాధర మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో ప్రపంచ మేధావి, డా..BR అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చొప్పదండి ఎమ్మెల్యే శ్రీ సుంకె రవిశంకర్ మరియు హైమాస్ లైట్ ను ప్రారంభించిన ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేనివిధంగా 125 అడుగుల భారీ విగ్రహాన్ని మన రాజధాని హైదరాబాదులో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నిర్మించుకోవడం జరిగింది. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దేశానికి ఆస్తి యువత, యువత సన్మార్గంలో నడిచి ఉన్నత స్థాయిలో స్థిరపడాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంబేద్కర్ పెట్టిన బిక్ష అన్నారు.

