బోడుప్పల్ మొదటి చర్చి స్థాపకులు
ఎద్దుల ఇమ్మానియేల్ జ్ఞాపకార్ధ కూడిక

- ఆయన పేరు మీద ఇమాన్యుయల్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభం..
- త్రిబుల్ ఎస్ గార్డెన్ లో పాస్టర్స్, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో..
- పాస్టర్స్ జెస్సిఫన్, అనిల్ కిరణ్, ఆక్వా అధ్యక్షులు కూర్క్ రత్నం హాజరు
బోడుప్పల్, మే 20 (విశ్వం న్యూస్) : 1982లో బోడుప్పల్ పరిసర ప్రాంతాల్లో మొట్టమొదటి క్రైస్తవ సంక్షేమ సంఘాన్ని స్థాపించిన వ్యక్తి, ఎబి నైజర్ ఇండిపెండెంట్ మెథడిస్ట్ చర్చ్ ఫౌండర్ కం ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఆర్టిసి ఉద్యోగి ఎద్దుల ఇమ్మానియేల్ (74) 11 మే 2023 రోజున స్వర్గస్తులైనారు. ఈరోజు అనగా శనివారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని త్రిబుల్ ఎస్ గార్డెన్లో ఆయన జ్ఞాపకార్ధ కూడికను కనివిని ఎరుగని రీతిలో నిర్వహించారు. ఆయన లోకయాత్ర ముగించబడిందని పాస్టర్స్ జెస్సిఫన్, అనిల్ కిరణ్, ఆదర్శ క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ కూర్క్ రత్నం ప్రకటించారు.
ఈ సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత 40 సంవత్సరాల క్రితమే దేవుడి మీద ప్రేమతో మొట్టమొదటి క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేసి నిరుపేద ప్రజల మీద ప్రేమ అనురాగాలతో పరిచర్య చేయడం జరిగింది. అదేవిధంగా బోడుప్పల్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ లో 1995లో ఎబినైజర్ ఇండిపెండెంట్ మెథడిస్ట్ చర్చ్ స్థాపించి దానికి ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఈ సందర్భంగా కుమార్తె అల్లుడు కుమారులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాస్టర్స్ తదితరుల ఆధ్వర్యంలో ఎద్దుల ఇమాన్యుయల్ ఇంకా పదికాలాల పాటు గుర్తుండిపోయే విధంగా ఆయన పేరు మీద ఇమ్మానియేల్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించారు. నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు వృద్ధులకు నిరుపేద ప్రజలకు క్రైస్తవులకు క్రైస్తవయేతరులకు చదువుతో పాటు అనారోగ్యంతో ఉన్నవారికి చికిత్స మెడిసిన్స్ నిరుపేదలకు బట్టలు, బెడ్ షీట్స్ ఏవైతే అవసరం ఉంటాయో అవి ఏర్పాటుచేసి ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కీర్తిశేషులు ఎద్దుల ఇమ్మానియేల్ ఈరోజు మన మధ్యల లేకపోవడం చాలా బాధాకరమని, కానీ ఆయన కొన్ని వందల సంవత్సరాల పాటు గుర్తిండి పోయే విధంగా ఎన్నో క్రైస్తవ సంఘాలు స్థాపించి, ఎంతో మంది నిరుపేద ప్రజల కోసం పరిచర్య చేశారని కొనియాడారు. ఇప్పుడు ఫిజికల్ గా ఆయన మధ్యలో లేకపోయినా.. పైనుండి దేవుని యొక్క ఒడిలో కూర్చున్నారని,ఆ దేవుడి ప్రేమ స్థానం పొందడం అంటే అది ఏసుప్రభు ఒడి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో త్రిబుల్ ఎస్ గార్డెన్ యజమాని, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తోటకూర శ్రీశైలం, ఆక్వా అధ్యక్షుడు కూర్కురత్నం, పాస్టర్లు, దైవజనులు, దేవుని బిడ్డలు, చర్చి సభ్యులు సంఘ సభ్యులు మహిళలు యువత తదితరులు హాజరయ్యారు.