స్వామి వారి సన్నిధిలో దాతలకు ఘన సన్మానం

స్వామి వారి సన్నిధిలో
దాతలకు ఘన సన్మానం

  • స్వామి వారి కటాక్షం
    ఉంటే అన్నీ ఉన్నట్లే…

హైదరాబాద్, జూన్ 5 (విశ్వం న్యూస్) : శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ కృష్ణ దేవాలయ ఈఓ సలహా మేరకు దాతలైన పెండ్యాల స్వాగత్ కుమార్ శ్రీలత, చీపర్తి రమేష్. విజయలక్ష్మి లను ఘనంగా సన్మానంచారు.శ్రీ వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి టెంపుల్ చైర్మన్, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గూడూరి చెన్నారెడ్డి దాతలను అభినందిస్తూ మన సాంప్రదాయాలను కాపాడేందుకు ఇలాంటి దాతలు సమాజానికి, ప్రజల మనశ్శాంతికి అవసరం అని కొనియాడారు. వాళ్ళు ఉదారంగా టెంపుల్ కి విచ్చేసి వారితో వారుగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని వాళ్ళ భుజాల మీద వేసుకొని చేసినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలాగే ఈ టెంపుల్ అభివృద్ధి పరిచి భగవత్ కృప పొందాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

దాతలు అందరూ కూడా తోచిన విధంగా విరాళాలు ప్రకటించి మీ యొక్క భక్తిని చాటుకొని భగవంతుని కృపాకటాక్షమును పొందగలరని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఆలయ స్థలములో ఒక ధ్వజస్తంభం నిలబెట్టాలని, భక్తుల సౌకర్యార్థం చిన్న చిన్న ఫంక్షన్లకు ఒక ఆర్సీసి స్లాబ్ వెయ్యాలని, పాలిష్ షాబాద్ ఫ్లోరింగ్, శానిటేషన్ సిస్టం, వంటావార్పులకు కిచెన్, వంటకు సంబంధించిన సామాగ్రి ఎంతో అవసరంగా ఉన్నదని చెన్నారెడ్డి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ జి శ్రీనివాస్ రావు, కోశాధికారి డి రవి గౌడ్, జాయింట్ సెక్రెటరీ జి .శ్రీధర్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ జి మహేందర్ రెడ్డి, కె.రాజ్ కుమార్ గౌడ్, కమిటీ మెంబర్ల సమక్షంలో పురోహితుల ద్వారా విగ్రహ ప్రతిష్టలు ఘనంగా నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *