
జమ్మికుంట, జూన్ 5 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణ పరిధిలోని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొలుగూరి సదయ్య ఇంటిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మొలుగూరి సదయ్య మాట్లాడుతూ నిన్న తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు దినోత్సవం సందర్భంగా ఆబాది జమ్మికుంట లో రైతు వేదిక లో రైతులతో మీటింగ్ జరుగుతుండగా ఆభాది జమ్మికుంటకు చెందిన బుర్ర కుమార్ అనే రైతు రుణమాఫీ, అకాల వర్షం నష్టపరిహారం ఎందుకు ఇస్తలేరు అని అడిగినందుకు స్థానిక ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి రైతు వేదికలో రైతును పట్టుకొని సిగ్గుందా…. నీకు సిగ్గు శరం ఉందా..అని బూతు మాటలు అనడం అతని వివేకానికి నిదర్శనం అని అట్టి మాటలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని బుర్ర కుమార్ నే కాదు రాష్ట్రంలోని ఉన్న రైతుల అందర్నీ తిట్టినట్టుగానే మేము భావిస్తున్నాం.. రైతుకు…రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది, క్షమాపణ చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు, బుర్ర కుమార్ రైతుకు అండగా ఉండి పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు .
ఈ కార్యక్రమములో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొలుగూరి సదయ్య , జమ్మికుంట పట్టణ మాజీ అధ్యక్షులు కసుబోజుల వెంకన్న, సతీష్ రెడ్డి, ఎర్రబెల్లి రాజేశ్వరరావు, పొనగంటి రవీందర్, నాగేందర్, మైనారిటి సెల్ సలీం పాషా, చెంచాలా శ్రీనివాస్, మైస సురేష్, పుల్ల రవి, మడిపెల్లి అశోక్, ఆక్కినపెల్లి మహేందర్, చిలువేరు రాజమౌళి, అమ్మ సంపత్, తదితరులు పాల్గొన్నారు.