పెద్దమ్మతల్లి గుడి నిర్మాణ శంకుస్థాపన
తొలి పూజ చేసిన బల్మూరి వెంకట్

జమ్మికుంట, జూన్ 9 (విశ్వం న్యూస్) : హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని పెద్దమ్మ తల్లి కోరిక అనుకునేలా సంఘటన జరిగింది. గురువారం జమ్మికుంట పట్టణ పరిధిలోని ధర్మారంలో పెద్దమ్మ తల్లి గుడి నిర్మానాణికి శంకుస్థాపనకు పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో తొలి పూజ చేసిన బల్మూరి వెంకట్. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదాలు ప్రజలపై ఉంటాయి అని ఆశిస్తున్నానని అన్నారు.

ఈ కార్యక్రమంలో బల్మూరి వెంకట్, జమ్మికుంట మాజీ పట్టణ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న, సీనియర్ నాయకులు, స్థానిక పి.ఏ.సి.ఎస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ అంజన్న, ముద్ద మళ్ల రవి, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
