
- వినియోగదారుల విన్నపం వినే నాధుడు లేడే
బండ్లగూడ జాగీర్, జూన్ 9 (విశ్వం న్యూస్) : విద్యుత్ బిల్లులు సాధారణంగా నెలకోసారి తీస్తుంటారు. మీటర్ రీడింగ్ నమోదు చేసి నెల రోజుల్లో ఎంత మేర యూనిట్లు కాలిస్తే అంత మేర బిల్లు రావడం పరిపాటి. అయితే ఇక్కడ స్లాబ్ రేట్ల పరంగా విద్యుత్ బిల్లులు జనరేట్ అవుతుంటాయి.

వంద యూనిట్ల వరకు ఒక్క రేటు.. ఆ తర్వాత ఒక యూనిట్ పెరిగినా మొత్తం యునిట్లకు స్లాబ్ రేట్లు మారుతుంటాయి. విద్యుత్ శాఖ ఉద్యోగులు నెల రోజులకు కరెంట్ బిల్లులు కొట్టాల్సి ఉంటుంది. అయితే 30 రోజుల వ్యవధిలో బిల్లులు తీయకుండా 31 రోజులు మించి బిల్లింగ్.. కొడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.
బిల్లింగ్ ఇలా లేట్ గా తీసి అదనంగా డబ్బులు కట్టేలా చేస్తున్నారు. ఈ మోసం ప్రతి నెల జరుగుతోంది. అయిన నోరు మూసుకొని బిల్లులు కొడుతున్నారు.