విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ
చేసిన కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్

బండ్లగూడ జాగీర్, జూన్ 9 (విశ్వం న్యూస్) : విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి మంచిస్థాయికి చేరుకోవాలని స్థానిక కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్ సూచించారు. శుక్రవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒకటో వార్డులో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, ఇతర సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు.

ఈ యొక్క వస్తువులు ఇచ్చినందుకు విద్యార్థులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్, స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్ రాధిక, తలారి ప్రేమ్ కుమార్, జి.బాబు, సుబ్బారెడ్డి, అనిల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.