లార్డ్స్ కళాశాల ఫ్యాకల్టీ కొలుగూరి సారికకు ఓయూ గౌరవ డాక్టరేట్

లార్డ్స్ కళాశాల ఫ్యాకల్టీ కొలుగూరి
సారికకు ఓయూ గౌరవ డాక్టరేట్

హైదరాబాద్, జూన్ 9 (విశ్వం న్యూస్) : ప్రముఖ లాడ్స్​ ఇనిస్టిట్యూట్ ఆఫ్​ ఇంజనీరింగ్​ అండ్​ టెక్నాలజీలో ఫ్యాకల్టీగా ఉన్నా సారిక కొలుగూరి ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగంలో డాక్టరేట్​ సాధించారు.

ప్రొఫెసర్​ ఎ.సూర్యనారాయణ పర్యవేక్షణలో “ఎ స్టడీ ఆన్​ ఎఫెక్టివ్​నెస్​ ఉమెన్​ అండ్​ చైల్డ్​ వెల్ఫేర్​ ఇన్​ రంగారెడ్డి అండ్​ నల్గొండ డిస్టిక్ట్​ (విత్​ స్పెషల్​ రిఫరెన్స్​ టు అంగన్​వాడి)” అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి సమర్పించారు. పరిశోధన గ్రంథాన్ని పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్​ బ్రాంచ్​ అధికారులు సారికకు పీహెచ్​డీ ప్రధానం చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.

2014 లో AP SET అర్హత సాధించిన ఆమె తన పరిశోధన క్రమంలో రూపొందించిన పలు పరిశోధన పత్రాలను జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో సమర్పించారు. ఈ సందర్భంగా కొలుగూరి సారికను మరియు ఆమె భర్త శ్రీ కేశవ్ని పలువురు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *