లార్డ్స్ కళాశాల ఫ్యాకల్టీ కొలుగూరి
సారికకు ఓయూ గౌరవ డాక్టరేట్

హైదరాబాద్, జూన్ 9 (విశ్వం న్యూస్) : ప్రముఖ లాడ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఫ్యాకల్టీగా ఉన్నా సారిక కొలుగూరి ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో డాక్టరేట్ సాధించారు.
ప్రొఫెసర్ ఎ.సూర్యనారాయణ పర్యవేక్షణలో “ఎ స్టడీ ఆన్ ఎఫెక్టివ్నెస్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇన్ రంగారెడ్డి అండ్ నల్గొండ డిస్టిక్ట్ (విత్ స్పెషల్ రిఫరెన్స్ టు అంగన్వాడి)” అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి సమర్పించారు. పరిశోధన గ్రంథాన్ని పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులు సారికకు పీహెచ్డీ ప్రధానం చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.
2014 లో AP SET అర్హత సాధించిన ఆమె తన పరిశోధన క్రమంలో రూపొందించిన పలు పరిశోధన పత్రాలను జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో సమర్పించారు. ఈ సందర్భంగా కొలుగూరి సారికను మరియు ఆమె భర్త శ్రీ కేశవ్ని పలువురు అభినందించారు.