మంత్రి గంగులను పరామర్శించిన వి.హెచ్.పి నాయకులు

తిమ్మాపూర్, జనవరి 11 (విశ్వం న్యూస్) : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, వారి కుటుంబ సభ్యులను కరీంనగర్ జిల్లా విశ్వహిందూ పరిషత్ కార్యవర్గ సభ్యులు బుధవారం పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా గంగుల మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివా ళులు అర్పించిన రాష్ట్ర సేవా ప్రముఖ్ కోమాళ్ల రాజేందర్ రెడ్డి, విభాగ్ గొరక్ష ప్రముఖ్ ఊట్కూరి రాధాకృష్ణ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మధు సూదన్ రావు, జిల్లా కార్యదర్శి ఆధిమూలం విద్యా సాగర్, పట్టణ అధ్యక్షులు రమేష్, నవనీత రావు, భగవాన్ రావు, ఆంజనేయులు, జగదీశ్వరచారి, గుజ్జేటి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.