సీఎస్ శాంతి కుమారిని అభినందించిన ఏపీ కాపు నాయకులు

హైదరాబాద్, జనవరి 11 (విశ్వం న్యూస్) : తెలంగాణ సీఎస్ గా శాంతి కుమారిని నియమించినందుకు బిఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, బిఆర్ఎస్ ఏపీ నాయకుడు పార్థసారథి, ఆర్. రామ్మోహన్ రావుతోపాటు పలువురు కాపు నాయకులు ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ గారిని కలిసి కృతజ్జతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శాంతి కుమారిని వారు ఈ సందర్భంగా అభినందించారు.