కరీంనగర్:బిఆర్ఎస్ పాలనలో బీసీలు అసంతృప్తి

బిఆర్ఎస్ పాలనలో
బీసీలు అసంతృప్తి

  • బిఆర్ఎస్ పాలనలో బీసీలు అసంతృప్తిగా ఉన్నారని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్

కరీంనగర్ బ్యూరో, జూన్ 12 (విశ్వం న్యూస్) : బీసీ యువజన సంఘం జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ, బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్న బీసీలు ఇప్పటివరకు కూడా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తెలంగాణ వస్తే బీసీల బతుకులు బాగుపడతాయి అనుకుంటే,ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను పూర్తిగా విస్మరించిందన్నారు. 2018 ఎలక్షన్ల ముందు బీసీలకు సబ్సిడీ రుణాలు ఇస్తామని ఎలక్షన్లకు పోయినటువంటి కేసీఆర్ గారు బీసీల ఓట్లతోటి గద్దె ఎక్కిన తర్వాత బీసీలను పట్టించుకున్న పాపాన పోలేదు.

2018లో సబ్సిడీ రుణాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 5 లక్షల 75 వేలమంది, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 20 వేల కు పైగా బీసీలు సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంట్లో కేటగిరి వన్ కింద యాభై వేల రూపాయల లోపు వారికి 1367 మందికి మాత్రమే కేటాయించి ఆ తర్వాత కేటగిరి టు ఒక లాక్షా, కేటగిరి త్రీ 2 లక్షల పైచీలకు గాను వాటి ఊసే ఎత్తలేదు. అంటే ఈ ప్రభుత్వానికి బీసీల పైన ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అన్నారు. ధరకాస్తు చేసుకున్న వాళ్లకు సబ్సిడి రుణాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో బీసీ కులాలకు 11 ఫెడరేషన్లు ఉంటే వాటికి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఫెడరేషన్ కి నిధులు విడుదల చేయలేదు.

11 ఫెడరేషన్లు ఉత్సవ విగ్రహాలు లాగానే ఉండిపోయాయి. మళ్ళీ ఎలక్షన్ ఇంకా ఆరు నెలల్లో ఉందనగా మళ్లీ బీసీ కులాల కుల వృత్తుల వారికి లక్ష రూపాయల రుణం అని చెప్పి ఆశలు కల్పించి ఓట్లు దండుకునే పనిలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. బీసీలు ఇంకా ఈ బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితులలో లేరన్నారు రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి బీసీలు ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్తారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్, నగర అధ్యక్షులు అనుమాసా నితిన్,జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ గుమ్మడి దారి మారుతి,జిల్లా జాయింట్ సెక్రెటరీ అల్గం శ్రీకాంత్, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *