స్తంభాన్ని తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించిన కార్పొరేటర్

స్తంభాన్ని తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించిన కార్పొరేటర్

బాగ్ అంబర్‌పేట్, జనవరి 11 (విశ్వం న్యూస్) : బాగ్ అంబర్పేట్ డివిజన్ తురాబ్ నగర్ లో తుప్పు పట్టిన విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఉందని స్థానికులు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి తుప్ప పట్టిన విద్యుత్ స్తంభాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తురాబ్ నగర్ లో తుప్పు పట్టిన విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఉన్నదని, దీనిని వెంటనే మార్చాలని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి ఇంచార్జ్ వెంకట్ రెడ్డి డివిజన్ బిజెపి అధ్యక్షులు చుక్క జగన్, బిజెపి నాయకులు పోచయ్యముదిరాజ్, దేవరపల్లి రమేష్, E.సుధాకర్, గుగ్గిళ్ళ శ్రీనివాస్,యోగేష్ గౌడ్, సునంద, వరలక్ష్మి, ముఖేష్ గౌడ్, రామ్ రెడ్డి, శ్రీధర్, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *