కరీంనగర్

అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ఆర్వోబీ పనులపై బీజేపీ,టీఆర్ఎస్ రాద్ధాంతం

కరీంనగర్: అసమర్థతను
కప్పిపుచ్చుకునేందుకే ఆర్వోబీ
పనులపై బీజేపీ,టీఆర్ఎస్ రాద్ధాంతం

  • ఎంపి బండి సంజయ్, మాజీ ఎంపి వినోద్ కుమార్ అసమర్థత వల్లే జాప్యం
  • ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే వారంరోజులలో పనులు ప్రారంభించండి
  • బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల తీరుపై తీగలగుట్టపల్లి రైల్వేట్రాక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన నగర కాంగ్రెస్

కరీంనగర్ బ్యూరో, జూన్ 18 (విశ్వం న్యూస్) : ఆర్వొబి నిర్మాణం విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం ఇరుపార్టీల నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల వైఖరిని ఖండిస్తూ రైల్వే ట్రాక్ వద్ద నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఒకవైపు ఇబ్బంది పడుతుంటే జాప్యానికి కారణం మీరంటే మీరని ఒకరిపై మరొకరు నెట్టేసి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎంపి బండి సంజయ్ కుమార్,మాజీ ఎంపి వినోద్ కుమార్ అసమర్థత వల్లే ఆర్వోబికి నిధులు మంజూరు కాలేదని నరేందర్ రెడ్డి అన్నారు.

ప్రతిరోజు కొన్ని వేలమంది ప్రయాణీకులు ఇబ్బంది పడుతుంటే స్కూలు బస్సులు అంబులెన్సులు గేటు వేసినప్పుడల్లా నిలిచిపోతుంటే చిత్తశుద్ధి లేని నాయకులు సంవత్సరాలకొద్ది జాప్యం చేసి మాఘనత అంటే మాఘనత అని ప్రకటలిచ్చుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇప్పటికయినా ప్రజల ఇబ్బందులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే పనులు ప్రారంభించాలని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మెతుకు కాంతయ్య, ఎండి తాజ్, శ్రవణ్ నాయక్,సమద్ నవాబ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం విలాస్ రెడ్డి, కుర్ర పోచయ్య, ఖమ్రొద్దిన్, దండి రవీందర్, దన్నసింగ్, బత్తిని చంద్రయ్య, అబ్దుల్ భారీ, షబానా మహమ్మద్, ఊరడి లత, మామిడి సత్యనారాయణ రెడ్డి, ముక్క భాస్కర్, సలీమొద్దిన్, షేక్ షేహన్ష, ఎగ్గడి శారద, నిహాల్ అహ్మద్, కంకణాల అనిల్ కుమార్, బొబ్బిలి విక్టర్, అన్న జ్యోతి, నెల్లినరేష్, నదీమ్, గంగుల దిలీప్ కుమార్, కుంబాల రాజ్ కుమార్, హనీఫ్, ఇమామ్, ఎండి బషీర్, దామోదర్, సాయిరాం, ఆంజనేయులు, జిలకర రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *