పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ
మహిళా అధ్యక్షురాలుగా
శ్రీలత బద్రు నాయక్ నియామకం

- మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి చేతుల మీదుగా నియామకం
- కమిటీకి కృతజ్ఞతలు తెలియజేసిన శ్రీలత భద్రు నాయక్..
పీర్జాదిగూడ, జూన్ 28 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగ రెండవసారి నియామక పత్రం అందుకున్న శ్రీలత భద్ర నాయక్. ఈ మేరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆర్ లక్ష్మీ చేతుల మీదుగా రెండోసారి పీర్జాదిగూడ కార్పొరేషన్ మహిళా అధ్యక్షురాలుగా నియామక పత్రం అందుకున్న మేడిపల్లి కాకతీయ కాలనీకి చెందిన శ్రీలత బద్రు నాయక్. ఈ సందర్భంగా శ్రీలత బద్రు నాయక్ మాట్లాడుతూ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చి రెండవసారి మహిళ అధ్యక్షురాలుగా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కందికంటీ శ్రీధర్, పీర్జాదిగూడ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు రెండు సంవత్సరాలు కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీలో మహిళల పాత్ర, అభివృద్ధి తదితరులను గమనించి, విశ్వసించి నాకు మళ్ళీ రెండవసారి ఈ బాధ్యత అప్పజెప్పడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు.అదేవిధంగా రాబోయే జనరల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం స్థాపించే విధంగా నా సాయి శక్తుల ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా మణులు అనంత లక్ష్మీ, బర్ల అనిత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యువత తదితరులు హాజరయ్యారు.