విద్య కాషాయికరణకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలి
బోడుప్పల్:విద్య కాషాయికరణకు
వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలి

- ప్రొఫెసర్ గంటా చక్రపాణి, ఖాసిం విద్యార్థులకు పిలుపు
- విప్లవ సిని నటుడు ఆర్ నారాయణమూర్తి హాజరు
బోడుప్పల్, జూన్ 28 (విశ్వం న్యూస్) : పాఠ్యపుస్తకాల్లో సిలబస్ మార్చుతూ, మూఢనమ్మకాలు పెంపొందిస్తూ జరుగుతున్న విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని ప్రొఫెసర్ గంటా చక్రపాణి, ప్రొఫెసర్ ఖాసిం విద్యార్థులకు పిలుపు నిచ్చారు. బుదవారం నాడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ లోని బొమ్మక్ ఆర్ కన్వెన్షన్ లో మూడవ రోజు జరుగుతున్న ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, సైద్ధాంతిక, రాజకీయ శిక్షణా తరగతులకు ప్రిన్సిపాల్ గా మణికంఠ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ గా గ్యార క్రాంతి, కాసొజ్ నాగజ్యోతి అధ్యక్షత వర్గంగా వహించగా, ప్రొఫెసర్ గంటా చక్రపాణి సంక్షోభంలో ఉన్నత విద్యారంగం, ప్రొఫెసర్ కాసిం మతం – మతోన్మాదం, లౌకికవాదం అనే అంశాలపై క్లాస్ లు బోధించారు.

యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లుగా ఆర్ ఎస్ ఎస్ వ్యక్తులను నియమించి, యూనివర్సిటీలను తమ ప్రయోగాలకు కేంద్రాలుగా మార్చుకుంటున్నారని తెలిపారు. పుస్తకాలలో భగత్ సింగ్, అంబేడ్కర్ చరిత్రలను తొలగించి, హెగ్డేవార్, సావర్కర్ ల పాఠాలు పెడుతున్నారని విమర్శించారు. శాస్త్రీయ విద్యా విధానాలను కాకుండా, మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. దేశంలో అమలవుతున్న విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని వారు విద్యార్థులకు పిలుపునిచ్చారు. విప్లవ సినీ నటుడు ఆర్. నారాయణ మూర్తి తన ఆట పాటలతో కాసేపు విద్యార్థులను ఉర్రూతలూగించారు. చదువు అనే ఆయుధాన్ని చేతపట్టి, విద్యార్థులు సమాజాన్ని మార్చాలని అన్నారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు శివరామకృష్ణ ఏఐఎస్ఎఫ్ చ రిత్ర, భవిష్యత్తు కార్యాచరణపై క్లాస్ బోధించారు.
ఈ శిక్షణ తరగతుల్లో ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్ ఎ స్టాలిన్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ రెహమాన్, నాగజ్యోతి, బి.రఘురాం, గ్యార క్రాంతి, సి. రాజు, సోతకు ప్రవీణ్, నరేష్, లెనిన్, రాష్ట్ర నాయకులు అన్వర్, హరీష్, చిన్న, సందీప్ వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్ది ప్రతినిదులు పాల్గొన్నారు.
