Today TrendingVishwam Newsతాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

మరోసారి ఆత్మహత్యకు యత్నించిన శేజల్

హైదరాబాద్, జూన్ 29 (విశ్వం న్యూస్) : బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అతని అనుచరులు తనను మానసికంగా వేధిస్తున్నారని గత కొంతకాలంగా ఢిల్లీలో ఆందోళ‌న చేస్తున్న ఆరిజన్ డెయిరీ (Origin Dairy) డైరెక్టర్ శేజల్ .. గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో హైదరాబాద్‌లోని పెద్దమ్మ గుడి వద్ద రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో కనిపించింది. అయితే.. ఆమె హ్యాండ్ బ్యాగులో నిద్ర మాత్రలతో పాటు ఓ లెటర్ కూడా లభించటంతో శేజల్ మళ్లీ ఆత్మహత్యకు యత్నించి ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ లేఖలో శేజల్ చాలా విషయాలు ప్రస్తావించింది. తనకు న్యాయం చేయాలంటూ పెద్దమ్మను కోరింది దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. ప్రభుత్వంపై నమ్మకం లేదంటూ లేఖలో తెలిపింది.

తన ఫోటోలను సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేస్తున్నారని అసభ్యకరంగా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని లేఖలో పేర్కొంది. ఎవరు వచ్చి ఎప్పుడు చంపుతారో అనే భయం తనకు ఏర్పడిందని చెప్పిన శేజల్ తనకు ఇక న్యాయం జరగదని అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. తాను చనిపోయిన తర్వాతైనా న్యాయం జరుగుతుందని అందుకే సూసైడ్ లెటర్ రాస్తున్నట్లు వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *